: ఢిల్లీకి బయలుదేరిన జగన్... పలువురు కేంద్ర మంత్రులతో భేటీ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. వారితో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాను జగన్ ప్రస్తావించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కాని పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని ఆయన కేంద్ర మంత్రులకు వివరించనున్నట్లు తెలుస్తోంది.