: నేపాల్ కు అమెరికా ఆపన్న హస్తం... 10 లక్షల డాలర్ల సహాయం
పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. భూకంపం జరిగిన వెంటనే స్పందించిన భారత్, పెద్ద ఎత్తున ఔషధాలు, ఆహారపదార్థాలతో పాటు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం అగ్రరాజ్యం అమెరికా కూడా నేపాల్ కు బాసటగా నిలిచింది. తక్షణ సాయం కింద 10 లక్షల డాలర్లను ప్రకటించిన అమెరికా, మరింత మేర సాయమందిస్తామని హామీ ఇచ్చింది. ఇక పొరుగునే ఉన్న చైనా కూడా నేపాల్ కు సహాయక సిబ్బందిని తరలించింది.