: తానా ఎన్నికల్లో సతీశ్ వేమన విజయభేరీ... సెక్రటరీగా మధుసూదన్ ఎన్నిక
హోరాహోరీగా సాగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సతీశ్ వేమన విజయం సాధించారు. ఈ పదవికి పోటీ చేసిన రామ్ యలమంచిలిపై సతీశ్ వేమన భారీ మెజారిటీతో నెగ్గారు. సెక్రటరీగా మధుసూదన్ టాటా విజయం సాధించారు. కోశాధికారిగా మురళి వెన్నమ్ ఎన్నిక కాగా, జాయింట్ సెక్రటరీగా రవి పొట్లూరి విజయం సాధించారు. గడచిన ఎన్నికలకు భిన్నంగా ఈ దఫా తానా ఎన్నికలు పోటాపోటీగా సాగాయి.