: ముంబయిలో మలింగ మ్యాజిక్... చేతులెత్తేసిన సన్ రైజర్స్


ముంబయి ఇండియన్స్ యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ (4/23)అద్భుతమైన స్పెల్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వణికించాడు. సన్ రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో బంతిని అందుకున్న ఈ లంకేయుడు ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి హైదరాబాద్ ను చావుదెబ్బ కొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి విహారిని అవుట్ చేసిన మలింగ, అదే ఓవర్లో 3, 4 బంతులకు ప్రవీణ్ కుమార్, స్టెయిన్ లను అవుట్ చేసి హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. అయితే, కర్ణ్ శర్మ మిగిలిన బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆట ఆఖరికి సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 8 వికెట్లకు 157 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News