: దేశంలో భూకంపం వల్ల 34 మంది చనిపోయారు: కేంద్ర హోంశాఖ కార్యదర్శి
దేశంలో భూకంప ప్రభావం వల్ల ఇంతవరకు 34 మంది మృతి చెందినట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్ వెల్లడించారు. బీహార్ లో 23, యూపీలో 8, పశ్చిమబెంగాల్ లో ముగ్గురు చనిపోయినట్టు మీడియాకు వివరించారు. భూకంప సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, భూకంప ప్రభావిత రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నామని గోయల్ తెలిపారు. అటు నేపాల్ కు 5 సహాయక బృందాలను పంపినట్లు చెప్పారు.