: మళ్లీ ఏర్పడుతున్న గర్జించే మేఘం!... జాగ్రత్త పడాలని హెచ్చరిక
అత్యంత ప్రమాదకర క్యుములో నింబస్ మేఘాలు తెలుగు రాష్ట్రాలపై మరోసారి విరుచుకుపడనున్నాయి. గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టికి కారణమైన ఈ మేఘాలు ఉపరితలంపై మరోసారి ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని పలు చోట్ల ఏకధాటిగా వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. రైతులు ముందే జాగ్రత్త పడాలని హెచ్చరించింది. కాగా, ఈ ఉదయం హైదరాబాద్ పరిధిలోని ఎల్ బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రకాశం, గుంటూరు, కరీంనగర్, అనంతపురం తదితర జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.