: సూర్యాపేట మార్కెట్ యార్డులో రైతుల విధ్వంసం
పగలూ రాత్రీ కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని ఆరోపిస్తూ, సూర్యాపేట మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. పంటకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేసిన రైతులు అక్కడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయిందని, దీన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తదుపరి పంటకు రుణాలివ్వాలని కోరారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.