: కోహ్లీ, డెవిలియర్స్ దెబ్బకు రాజస్థాన్ అబ్బా...!
ఐపీఎల్-8లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన టీ-20 మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస వైఫల్యాలకు చెక్ చెప్పుకుంది. కెప్టెన్ కోహ్లీతో పాటు విధ్వంసక బ్యాట్స్ మన్ డివిలియర్స్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. తొలుత బౌలర్లు రాణించడంతో, 130 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ జట్టు ఆపై ఫీల్డింగ్ లోనూ చేతులెత్తేసింది. ఇక బెంగళూరు జట్టులో ఓపెనర్ క్రిస్‌గేల్ (17 బంతుల్లో 20) తక్కువ పరుగులకే అవుట్ అయినా, కెప్టెన్ విరాట్ కోహ్లి (46 బంతుల్లో 62), డివిలియర్స్ (34 బంతుల్లో 47) చెలరేగి ఆడి 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు విజయాన్ని అందించారు.