: అగ్ని పర్వతం పేలింది ఒకదేశంలో...జనాలు బెంబేలెత్తుతోంది ఇంకో దేశంలో
చిలీలో పేలిన అగ్నిపర్వతం ధాటికి అర్జెంటీనా వణుకుతోంది. 42 ఏళ్ల విరామం తరువాత చిలీలోని కాబుకో అగ్ని పర్వతం బద్దలైంది. ఈ అగ్ని పర్వతం పేలుడు తీవ్రతకు జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. దాంతో పొరుగు దేశమైన అర్జెంటీనాలో సైతం వంద కిలోమీటర్ల పరిధిలో దట్టమైన బూడిద అలముకుంది. రోడ్లమీద ఎక్కడ చూసినా రెండు అంగుళాల ఎత్తున బూడిద పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని పర్వతం బద్దలైన 24 గంటల్లోనే అక్కడ రెండు సార్లు భూకంపం సంభవించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కాబుకో పర్వతానికి దగ్గర్లో ఉండే ఎన్ సెనెడా పట్టణాన్ని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది.