: ప్రాణాలు తీస్తున్న క్రికెట్... బంతి తగిలి ఆరేళ్ల బాలుడు మృతి


జంటిల్మన్ క్రీడ క్రికెట్ ప్రాణాలు తీసే క్రీడగా మారుతోంది. సరైన పర్యవేక్షణ లేకుండా క్రికెట్ ఆడుతూ చిన్నారులు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్, వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ లో క్రికెట్ ఆడుతూ, బంతి తగిలి వంశీకృష్ణ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ, బాల్ తగిలి గాయపడ్డ వంశీకృష్ణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. అంత వరకూ తమతో పాటు ఉండి, చలాకీగా ఆడుకునే బాలుడు మరణించడంతో సహారా ఎస్టేట్ కుటుంబాల్లో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News