: రాత్రంతా మంచుకొండల్లో గడిపి, ఉదయాన్నే కేదార్ నాథ్ ఆలయంలో రాహుల్ పూజలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేధార్ నాథ్ ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదార్ నాథ్ చేరుకునే క్రమంలో నిన్న మంచుకొండలపై 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన రాహుల్, రాత్రి గౌరీకుండ్ లో గడిపారు. పొద్దునే కేదార్ నాథ్ గుండంలో స్నానం చేసిన ఆయన గుడి తలుపులు తెరవగానే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రెండేళ్ల నాటి వరదల ఘటనలను ఆయన గుర్తు తెచ్చుకున్నారు. మరోసారి అటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని శివుడిని వేడుకున్నట్టు తెలిపారు.