: నేడు గులాబీమయం కానున్న హైదరాబాదు... టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం!


హైదరాబాదు నగరం నేడు గులాబీ రంగు పులుముకోనున్నది. టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నగరానికి తరలివస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలంతా హైదరాబాదు చేరుకున్నారు. తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంతో ప్లీనరీకి ఏర్పాట్లు జరిగాయి. అంతేకాక, ఆయా జిల్లాల నుంచి వస్తున్న నేతలు, కార్యరకర్తలకు స్వాగతం పలుకుతూ నగరంలో పెద్ద ఎత్తున హోర్డింగ్ లు, గులాబీ జెండాలు వెలిశాయి. నిన్న రాత్రి నుంచే నగరం గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. ఇదిలా ఉంటే, ప్లీనరీకి 40 వేల మంది దాకా వస్తారని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి.

  • Loading...

More Telugu News