: ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'గా ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు 'అమరావతి'గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన మంత్రి మండలి సమావేశంలో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన 'అమరావతి' పేరు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి పెట్టాలని కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే 'అమరావతి' నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఏదైనా ఆటంకం కలిగితే జూన్ 12 లేదా 13 తేదీల్లో శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిని 225 చదరపు కిలోమీటర్ల నుంచి 375 చదరపు కిలో మీటర్లకు పెంచాలని తాజాగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమిని భూసేకరణ చట్టం ద్వారా సేకరించనున్నట్టు నేతలు పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు.