: తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి మార్గం సుగమం
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలోని పొరపాట్లను సవరిస్తూ రూపొందించిన నివేదిక దస్త్రంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. ఈ క్రమంలో సవరించిన కొత్త నిబంధనల ప్రకారం ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఏడు సీట్లలో ఆరు మాత్రమే భర్తీ కానున్నాయి. అటు స్థానిక సంస్థల కోటాలో మూడు సీట్లు పెరగనున్నాయి. కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఒక్కో సీటు పెరగనుంది. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.