: ఔరంగాబాద్ మున్సిపాలిటీలో సత్తా చాటిన ఎంఐఎం


మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ నెమ్మదిగా పాగా వేస్తోంది. మొన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుని తన ఉనికి చాటిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఔరంగాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకుని, శివసేనకు సవాలు విసురుతోంది. మొత్తం 113 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి 54 డివిజన్లను గెలుచుకోగా, ఎంఐఎం పార్టీ 22 డివిజన్లలో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అంతే కాకుండా మున్సిపాలిటీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకుంది. శివసేన ప్రాబల్యం అధికంగా ఉండే ఔరంగాబాద్ లో ఎంఐఎం ఉనికిని చాటుకోవడంతో ఆ పార్టీలో భవిష్యత్ పై ఆశలు రేగుతున్నాయి.

  • Loading...

More Telugu News