: మీడియా తీరును ఎద్దేవా చేసిన ఎంపీ సౌగత్ రాయ్
మీడియా తీరును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ఎద్దేవా చేశారు. ఒక రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే మీడియా చక్కగా వీడియో తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. లోక్ సభలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, మీడియా తీరును తప్పుపట్టారు. ఒక మనిషి మరణించేందుకు సిద్ధపడుతూఉంటే, ఆ ప్రయత్నం నుంచి అతనిని విరమింపజేసే ప్రయత్నం చేయకుండా, దానిని చిత్రీకరించడం అతి పెద్ద విషాదంగా భావిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే.