: సానియా జోడీకి షాక్... పోర్షే గ్రాండ్ ప్రీ నుంచి ఔట్


ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న సానియా మీర్జా, మార్టిన్ హింగిస్ జోడీకి ఎదురుదెబ్బ తగిలింది. స్టట్ గార్ట్ లో జరుగుతున్న పోర్షే గ్రాండ్ ప్రీలో సానియా జోడీ తొలి రౌండ్ లో ఓటమిపాలైంది. పెట్రా మార్టిస్, స్టెఫానీ వోట్ ద్వయం 6-3, 6-3తో వరుస సెట్లలో సానియా జోడీని చిత్తు చేసింది. పరాజయం అన్నది ఎరగకుండా ఇండియన్ వెల్స్, మయామి, చార్లెస్టన్ ఓపెన్ టోర్నీల్లో జయకేతనం ఎగురవేసిన సానియా, హింగిస్ లకు ఈ ఓటమితో షాక్ తగిలింది. సానియా-హింగిస్ మహిళల డబుల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ జోడీ కాగా, తాజా ఓటమితో తమ ర్యాంకును ప్రమాదంలో పడేసుకున్నారు. మాటెక్ సాండ్స్, సఫరోవా జోడీ గనుక పోర్షే గ్రాండ్ ప్రీలో టైటిల్ నెగ్గితే సానియా జోడీని వెనక్కినెట్టి అగ్రపీఠం అధిష్ఠిస్తారు.

  • Loading...

More Telugu News