: లోక్ సభలో చేతులెత్తి వేడుకున్న వెంకయ్య నాయుడు


దేశ రాజధానిలో అందరూ చూస్తుండగా, రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయాలను కదిలించి వేస్తోందని, దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన రెండు చేతులెత్తి దండం పెట్టడంతో మిగతా సభ్యులు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రైతు ఆత్మహత్యపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో ప్రకటన చేస్తారని, దయచేసి సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వాలంటూ ఆయన కోరారు. కాగా, రైతు ఆత్మహత్యపై విపక్షాలు పట్టు వీడకపోవడంతో సభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది.

  • Loading...

More Telugu News