: చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ. 5 లక్షలేనట!


చెన్నై సూపర్ కింగ్స్... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై ఐపీఎల్ జట్టు. గత సంవత్సరం ఈ జట్టు విలువ రూ. 450 కోట్లు. ఈ సంవత్సరం విలువ రూ.5 లక్షలుగా ఫ్రాంచైజీ చూపించింది. ఈ విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీ తీరును తప్పుబడుతూ, సీరియస్ అయినట్టు సమాచారం. కేవలం ఒక్క సంవత్సరంలోనే టీమ్ విలువ ఇంతగా ఎలా పడిపోయిందంటూ ఫ్రాంచైజీని ప్రశ్నించింది. ఈ మేరకు జట్టు యాజమాన్యానికి నోటీసులు పంపింది. విలువను సరిగా చూపించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ. 5 లక్షలే అయితే, మేము కొంటామంటే మేము కొంటామంటూ, సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News