: మా క్రికెటర్లతో అమ్మాయిలు వేగలేరు: డేల్ స్టెయిన్


క్రీడాకారులతో, ముఖ్యంగా క్రికెటర్లతో జీవితం పంచుకోవాలని చూసే అమ్మాయిలు కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనని సన్‌ రైజర్స్ జట్టు స్టార్ ఆటగాడు, పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ అంటున్నాడు. క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనుకునే అమ్మాయిలతో పాటు, అబ్బాయిలకూ ఇబ్బందులు తప్పవని స్టెయిన్ అన్నాడు. అమ్మాయి కూడా క్రీడాకారిణి అయితే, మరిన్ని ఇబ్బందులు ఉంటాయని, ఇంటికి దూరంగా గడుపుతూ, ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి నెలకొంటుందని అన్నాడు. తన జీవితంలోనూ ఇటువంటి స్థితి వచ్చిందని, నిత్యం ప్రయాణాలతో బిజీగా ఉన్నప్పుడు తన మాజీ ప్రియురాలు వెంట వచ్చేదని, ఇప్పుడు సన్నిహితుల్ని వెంట తెచ్చుకుంటున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News