: మోదీ ‘గివ్ ఇట్ అప్’ కాల్ కు జైకొట్టిన అనిల్ అంబానీ!


ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘గివ్ ఇట్ అప్’ పిలుపుకు అడాగ్ సంస్థల అధినేత అనిల్ అంబానీ స్పందించారు. గ్యాస్ సబ్సిడీని వదులుకుని సర్కారుకు బాసటగా నిలిచారు. అంతేకాదండోయ్, గ్యాస్ సబ్సిడీ వదులుకుని తన బాటలో పయనించాలని ఆయన తన కంపెనీకి చెందిన దాదాపు లక్ష మంది ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంపన్నులు తమ గ్యాస్ సబ్సిడీని వదులుకునేందుకు ముందుకురావాలని ప్రధాని మోదీ ‘గివ్ ఇట్ అప్’ పేరిట గత నెలలో వినూత్న ప్రకటనను జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుకు ఇప్పటికే భారత పారిశ్రామికరంగ దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ, అనిల్ అగర్వాల్ లు సానుకూలంగా స్పందించారు. తాజాగా అనిల్ తాను స్పందించడంతో పాటు ‘గివ్ ఇట్ అప్’కు మద్దతు తెలపాలని తన కంపెనీ ఉద్యోగులకు పిలుపునివ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News