: జపాన్ ప్రధాని కార్యాలయం పైకప్పుపై డ్రోన్... అధికారుల్లో కలవరం
జపాన్ ప్రధాని షింజో అబే కార్యాలయం పైకప్పుపై ఓ డ్రోన్ ను గుర్తించారు. టోక్యోలో ఈ చిన్న డ్రోన్ పీఎం ఆఫీసుపై ల్యాండవడంతో అధికారుల్లో కలకలం రేగింది. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికైతే బాధ్యులెవరన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్ కారణంగా ఎవరికీ గాయాలు కాలేదని, ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని షింజో అబే జపాన్ లో లేరు. ఆయన ఆసియా-ఆఫ్రికా కాన్ఫరెన్స్ నిమిత్తం ఇండోనేషియా వెళ్లారు. కాగా, నాలుగు ప్రొపెల్లర్లతో కూడిన ఈ డ్రోన్ కు చిన్న కెమెరా అమర్చి ఉంది.