: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో టాప్ లో రంగారెడ్డి... చివరి స్థానంలో నల్గొండ జిల్లా


తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 43 శాతంతో చివరి స్థానంలో నల్గొండ జిల్లా ఉందని ఫలితాలు విడుదల చేసిన మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారని, ఇంటర్ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫీజుకు తుది గడువు మే 1గా నిర్ణయించినట్టు కడియం వివరించారు. కాగా, ఏప్రిల్ 26 నుంచి మార్కుల జాబితా తీసుకోవచ్చని చెప్పారు. లోపాలు ఉంటే మే 22లోగా ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

  • Loading...

More Telugu News