: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది భారత యాత్రికుల దుర్మరణం


నేపాల్ లో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు 300 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భారత్ నుంచి వెళ్లిన యాత్రికుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 37 మంది దాకా తీవ్రంగా గాయపడ్దారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన భారత యాత్రికులు గుజరాత్ కు చెందిన వారని తెలుస్తోంది. నేపాల్ రాజధాని ఖాట్మండూ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ పోలీసులు క్షతగాత్రులను ఖాట్మండూ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News