: హీరోయిన్ అయ్యేందుకు యువతి ‘కమీషన్’ దందా...జనాలకు రూ.10 కోట్ల మేర కుచ్చుటోపీ!


అందంతో పొంగిపోయింది. వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమేననుకుంది. హైదరాబాదు వచ్చేసింది. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయినా మనసులో గూడుకట్టుకున్న హీరోయిన్ కావాలన్న వాంఛ మాత్రం చావలేదు. ఏం చేద్దామని స్నేహితుడితో పరిపరివిధాల యోచించింది. సొంతంగా సినిమా తీయడమొక్కటే మార్గమని ఎంచుకుంది. మరి డబ్బు? దానిని సంపాదించేందుకు చివరకు ‘మోసం’ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం సహకరించేందుకు ఎవరు ముందుకొస్తారు? అందుకే ప్రేమించిన స్నేహితుడినే పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి చక్రం తిప్పారు. కమీషన్ల దందాను ప్రారంభించారు. నెలకు 10 శాతం కమీషనంటూ జనాన్ని ఊదరగొట్టారు. రూ.10 కోట్ల మేర సేకరించారు. తీరా అనుకున్న కమీషన్ ను చెల్లించడంలో విఫలమయ్యారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రాచమార్గంలో నగరంలో అడుగుపెట్టిన ఆ యువతి దొడ్డిదారిన పరారీ కావాల్సి వచ్చింది. ఇదీ హీరోయిన్ అవకాశాల కోసం నగరానికి వచ్చి, జనాన్ని నట్టేట ముంచిన సురేఖ అనే యువతి కథ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని, హైదరాబాదు బంజారాహిల్స్ లో చక్రం తిప్పింది. ప్రస్తుతం ఆమె భర్త శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News