: ‘హ్యూమన్ రైట్స్’ పేరిట ఘరానా మోసం... రూ.80 లక్షలు కాజేసిన ముఠా అరెస్ట్


మానవ హక్కుల సంఘం పేరిట మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇదివరకే ఈ తరహా మోసాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చోటుచేసుకోగా తాజాగా శ్రీకాకుళం జిల్లా నయా మోసానికి కేంద్రంగా నిలిచింది. ఈ జిల్లాకు చెందిన పోలాకి సూర్యనారాయణ మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడినంటూ రంగంలోకి దిగి పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నాడు. ఈ నయా దందాలో అతడికి మరో ఐదుగురు వ్యక్తులు సహకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... సూర్యనారాయణ, అతడికి సహకరించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరు అమాయక జనం నుంచి రూ.80 లక్షల మేర కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News