: సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు
తెలంగాణ రాష్ట్ర సర్కారు విధించిన రవాణా పన్నుపై ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ వాహనాలు తెలంగాణలో పన్ను చెల్లించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ట్రావెల్స్ యజమానులు పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని ఉమ్మడిగా ఉన్నందున పన్ను వర్తించదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని వారాల క్రితం తెలంగాణలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలపై ప్రభుత్వం రవాణా పన్ను విధించడం తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. అయినా, తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గలేదు.