: రాజస్థాన్ భారీ స్కోరు... పంజాబ్ టార్గెట్ 192 పరుగులు
ఓపెనర్లు రహానే (74), వాట్సన్ (45) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ భారీస్కోరు సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. నాయర్ 13 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. చివర్లో బిన్నీ 4 బంతుల్లో 12* పరుగులు పిండుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ కు అహ్మదాబాదులోని మొతేరా మైదానం వేదిక.