: రాయల్స్ శుభారంభం... బ్యాట్లకు పనిచెప్పిన రహానే, వాట్సన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శుభారంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ జట్టు ఓపెనర్లు రహానే (40 బ్యాటింగ్), వాట్సన్ (43 బ్యాటింగ్) పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు సునాయాసంగా లభించాయి. ప్రస్తుతం రాయల్స్ 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ డొల్లతనం మరోసారి వెల్లడైంది. మిచెల్ జాన్సన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. రాయల్స్ స్కోరు 200 మార్కును చేరే అవకాశాలున్నాయి.