: హైజాక్ చేస్తున్నా... దుబాయ్-హైదరాబాద్ విమానంలో వ్యక్తి కలకలం


హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో హైజాక్ కలకలం రేగింది. దుబాయ్-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తాను విమానాన్ని హైజాక్ చేస్తున్నానంటూ అరవడంతో అందరూ హడలిపోయారు. యూసఫ్ అనే ఈ వ్యక్తి విమానం ఎగ్జిట్ వద్ద అడ్డంగా నిలబడి, హైజాక్ చేస్తున్నానని బెదిరించసాగాడు. అతడు ఓ ఎయిర్ హోస్టెస్ ను తీవ్రంగా బెదిరించడంతో ఆమె భయాందోళనలకు గురైంది. అయితే, అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు పోలీసులకు అప్పగించారు. ఎయిర్ హోస్టెస్ ను ఎగతాళి చేసేందుకే హైజాక్ అంటూ బెదిరించానని అతడు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News