: తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్రం ప్రశంసలు
తెలంగాణ ప్రజలకు ఉచిత తాగునీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దాన్ని మార్గనిర్దేశంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించింది. అటు కేంద్రం ప్రశంసపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, చాలా ఆనందంగా ఉందన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ఇతరులకు ఆదర్శంగా నిలవడం సంతోషించే విషయమని చెప్పారు. సకాలంలో దాన్ని పూర్తిచేసి ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.