: మోదీ ఆఫ్రికాలో కూడా పర్యటించాలి: ఒమర్ అబ్దుల్లా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించడాన్ని తప్పుబట్టలేమని, అయితే, ఆయన ఆఫ్రికా దేశాల్లోనూ పర్యటించాలంటున్నారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఆఫ్రికా దేశాలు భారత్ కు సంప్రదాయ మిత్రులని ఒమర్ తెలిపారు. సుందరమైన ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలను సందర్శించిన మోదీ, ఆఫ్రికా కూడా వెళితే బాగుంటుందని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీతో పాటు పలు ఆసియా దేశాల్లో పర్యటించడం తెలిసిందే.