: ముంబయి హైకోర్టుగా మారనున్న బాంబే హైకోర్టు?
బాంబే హైకోర్టులోని 'బాంబే' పదాన్ని 'ముంబయి'గా మార్చాలని కేంద్ర న్యాయశాఖ ఆలోచన చేస్తోంది. దానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు తెస్తానని న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ శివసేన ఎంపీలకు గతంలో హామీ ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలో సేన ఎంపీ వినాయక్ రౌత్ ఇటీవల లోక్ సభ సమావేశాల్లోని జీరో అవర్ లో బాంబే హైకోర్టు పేరు మార్పు విషయాన్ని లేవనెత్తారు. దాంతో పదం మార్పుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని గౌడ సేన ఎంపీలకు చెప్పారట. త్వరలోనే దానికి సంబంధించిన ప్రతిపాదన యూనియన్ కేబినెట్ ముందుకు రాగానే ఆమోదించడం ఖాయమంటున్నారు. రెండు వారాల కిందట ఇదే విషయంపై మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రం అనుమతితో రాష్ట్ర హైకోర్టు పేరు మార్చాలన్న డిమాండ్ ను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.