: నేను పార్టీ మారడంలేదు... టీడీపీలోనే ఉంటా: కూకట్ పల్లి ఎమ్మెల్యే


తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్నారంటూ వస్తున్న వార్తలను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని, తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో కూడా పాల్గొంటానని కృష్ణారావు తెలిపారు. గతంలో టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన ఆయన... కొన్ని కులాలను బీసీ వర్గం నుంచి తొలగించారని దానిని పునరుద్దరిస్తే టీఆర్ఎస్ లో చేరతానని చెప్పారు. తరువాత ఏమైందోగానీ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News