: కిలోమీటరుకు రూపాయి ఖర్చుతో ఢిల్లీకి విమాన ప్రయాణం: ఎయిర్ ఆసియా


దేశంలోని వివిధ నగరాల నుంచి ఢిల్లీకి మరిన్ని సర్వీసులు నడపనున్నట్టు లో-కాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఆసియా ప్రకటించింది. ఈ విమానాల్లో టిక్కెట్ల ధరలు కిలోమీటరుకు రూపాయి నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ భారత చీఫ్ మిట్టూ శాండిల్య తెలిపారు. మే 21 నుంచి న్యూఢిల్లీ - బెంగళూరు, న్యూఢిల్లీ - గోవా, న్యూఢిల్లీ - గౌహతీల మధ్య సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆయన వివరించారు. ఈ సర్వీసులకు ఈ నెల 26 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మే 21 నుంచి మే 31 మధ్య ప్రయాణాలకు ఆఫర్ టిక్కెట్ రేట్లు వర్తిస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News