: ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ ఇక లేరు... గుండెపోటుతో తిరుపతిలో మృతి


ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ (88) కన్నుమూశారు. రాష్ట్రీయ విద్యా పీఠ్ లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న తిరుపతి వచ్చిన ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెనువెంటనే ఆయనను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) లో చేర్పించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆయన నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒడిశాకు 14 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన జేబీ పట్నాయక్ కేంద్ర మంత్రిగానూ పదవి చేపట్టారు. అసోం గవర్నర్ గానూ పనిచేసిన జేబీ పట్నాయక్ కు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు ఉంది.

  • Loading...

More Telugu News