: కత్తులతో కలకలం రేపిన పైలట్


లండన్ హీత్రూ విమానాశ్రయంలో ఓ పైలట్ (61) కత్తులతో పట్టుబడ్డాడు. దీంతో, అందరిలోనూ కలకలం రేగింది. క్యాథే పసిఫిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ పైలట్ లండన్ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానంలో విధులు నిర్వర్తించాల్సి ఉంది. విమానంలో 260 మందికి పైగా ప్రయాణికులున్నారు. జర్మన్ వింగ్స్ విమానం ఉదంతం నేపథ్యంలో, సిబ్బందిని తనిఖీ చేస్తుండగా ఈ పైలట్ వద్ద కత్తులు దొరికాయి. దీంతో, అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పై విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News