: చైనా మార్క్సిస్టు పార్టీని బీజేపీ అధిగమించింది... ఇది ప్రపంచ రికార్డు: కామినేని
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృష్ణాజిల్లా కైకలూరులో మీడియాతో మాట్లాడారు. సభ్యత్వ నమోదులో బీజేపీ ఇప్పుడు ఎవరూ అందుకోనంత ఎత్తుకు చేరుకుందని తెలిపారు. చైనా మార్క్సిస్టు పార్టీ 8.3 కోట్ల సభ్యత్వాలు నమోదు చేయగా, ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వాలు 10 కోట్లు దాటాయని వివరించారు. ఇది ప్రపంచ రికార్డు అని చెప్పారు. తమ పార్టీ సభ్యత్వ నమోదుకు ఇంకా పది రోజుల గడువు మిగిలే ఉందని, ఈలోగా సభ్యత్వాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.