: ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో... అన్ని సెక్టార్లూ బేర్!


బ్యాంకింగ్ నుంచి ఐటీ వరకూ ఎఫ్ఎంసీజీ నుంచి పవర్ వరకూ అన్ని రంగాల్లోని కంపెనీల ఈక్విటీలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా, భారత స్టాక్ మార్కెట్ 555 పాయింట్లకు పైగా దిగజారింది. దీంతో గడచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం కాగా, సుమారు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచి 555.89 పాయింట్లు పతనమై 1.95 శాతం నష్టంతో 27,886.21 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 157.90 పాయింట్లు దిగజారి, 1.83 శాతం నష్టంతో 8,448.10 పాయింట్ల వద్దా కొనసాగాయి. లుపిన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎసిసి, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను పొందగా; ఎన్ఎండీసీ, రిలయన్స్, హీరో మోటోకార్ప్, హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. డిసెంబర్ 2015 నాటికి నిఫ్టీ టార్గెట్ ను తగ్గిస్తూ, 9,200 నుంచి 9,600 పాయింట్ల మధ్య ఉండవచ్చని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ యూబీఎస్ వేసిన అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తగ్గించాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 2.02 శాతం, స్మాల్ క్యాప్ 2.17 శాతం నష్టపోయాయి. రియాల్టీ 2.78 శాతం, ఎఫ్ఎంసీజీ 2.71 శాతం, బ్యాంకెక్స్ 1.35 శాతం, కాపిటల్ గూడ్స్ 2.17 శాతం, మెటల్స్ 1.78 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.91 శాతం, పవర్ 2.04 శాతం, టెక్ 2.22 శాతం పడిపోయాయి.

  • Loading...

More Telugu News