: మోదీ చెప్పారు... ఈయన ఆచరించాడు!


ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల స్వల్ప దూర ప్రయాణాలకు సైకిల్ వినియోగించండంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాలుష్యం తగ్గించేందుకు నెలకోసారి సైకిల్ వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచనను ఈ రాజస్థాన్ ఎంపీ అక్షరాలా పాటిస్తున్నారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. మోదీ మాటను గౌరవిస్తూ, ఆయన పార్లమెంటుకు నేడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. తొలుత మేఘ్వాల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అభినందించారు. సైకిల్ తొక్కడం ద్వారా వాతావరణం లో కర్బన ఉద్గారాలను తగ్గించిన వారమవుతామని ఆయన పేర్కొన్నారు. అందుకే సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News