: ఎన్ కౌంటర్ పే ‘బద్లా లేంగే’... అనుచరులకు ఉగ్రవాది రియాజ్ భత్కల్ ఫోన్!
తెలుగు రాష్ట్రాలకు సవాల్ విసిరిన సూర్యాపేట షూటర్స్ లో తప్పించుకున్న ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగిస్తుండగానే పోలీసులకు మరో షాకిచ్చే వార్త తెలిసింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్న ఉగ్రవాది రియాజ్ భత్కల్, ఎన్ కౌంటర్ పై ప్రతిస్పందిస్తూ ప్రతిదాడులకు తన అనుచరులను సమాయత్తం చేస్తూ జరిపిన ఫోన్ సంభాషణలు తాజాగా వెలుగుచూశాయి. ‘ఎన్ కౌంటర్ పే బద్లా లేంగే‘ అంటూ అతడు తన అనుచరులతో జరిపిన ఫోన్ సంభాషణలు ప్రస్తుతం తెలంగాణ పోలీసులను కలవరపెడుతున్నాయి.