: రహానే, వాట్సన్ వీరవిహారం... గెలుపు దిశగా రాయల్స్
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓపెనర్లు రహానే (52 బ్యాటింగ్), వాట్సన్ (63 బ్యాటింగ్) బ్యాట్లు ఝుళిపించడంతో 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ విజయం దిశగా సాగిపోతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. విజయానికి 42 బంతుల్లో 42 పరుగులు అవసరం కాగా, చేతిలో 10 వికెట్లున్నాయి. రాయల్స్ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు చెన్నై బౌలర్లు చెమటోడ్చుతున్నారు. కెప్టెన్ ధోనీ ఎన్ని మార్పులు చేసినా ఫలితం దక్కలేదు.