: ఇంతకీ ఐఫోన్ గొప్పదా? శాంసంగ్ స్మార్ట్ ఫోన్ గొప్పదా?... బీరు బాటిళ్లతో పొడుచుకున్న యువకులు
అమెరికాలో ఇద్దరు యువకుల మధ్య వాగ్యుద్ధం ఘర్షణగా మారింది. ఇరువురు బీరు బాటిళ్లతో పొడుచుకునేంతవరకు వెళ్లింది. విషయం ఏమిటంటే... అమెరికాలోని ఓక్లహామాలోని టుల్సా పట్ణణంలో ఇద్దరు యువకుల మధ్య ఐఫోన్ గొప్పదంటే, కాదు శాంసంగ్ స్మార్ట్ ఫోనే గొప్పదంటూ వాదన మొదలైంది. వారిలో ఒకరు ఐఫోన్ ఘనతను అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తి శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మేలైనదన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశాడు. దీంతో, ఇద్దరు రూమ్మేట్లు బాహాబాహీ కలబడ్డారు. మద్యం మత్తులో బీరు బాటిళ్లు పగలగొట్టి పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రగాయాలపాలై రక్తమోడుతున్న వారిని చూసి కొందరు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి ఆ యువకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.