: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై... మొతేరాలో మోత మోగిస్తారా?


ఐపీఎల్ సమరంలో ఈ సాయంత్రం ఆసక్తికర మ్యాచ్ కు తెరలేచింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో మ్యాచ్ కోసం టాస్ వేశారు. టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్స్ జట్టులో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వాట్సన్, రహానే, సంజూ శాంసన్, ఫాక్నర్... చెన్నై జట్టులో ధోనీ, డ్వేన్ స్మిత్, మెక్ కల్లమ్, రైనా, డు ప్లెసిస్, బ్రావో వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై నెలకొంది.

  • Loading...

More Telugu News