: కిసాన్ ర్యాలీలో తూలి పడబోయిన మహిళా నేత... పట్టుకుని నిలబెట్టిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ర్యాలీలో కొద్దిసేపటి క్రితం అపశ్రుతి చోటుచేసుకుంది. రాంలీలా మైదాన్ లో జరుగుతున్న ఈ ర్యాలీ వేదికపైకి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు చేరుకున్నారు. ఈ సమయంలో పార్టీ నేతలు వారిని సత్కరించేందుకు వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ మహిళా నేత రాహుల్ గాంధీని అభినందిస్తూ అక్కడికక్కడే తూలిపడబోయారు. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ, ఆమెను పట్టుకుని నిలబెట్టారు. అయినా, ఆమె నిలదొక్కుకోలేకపోయారు. దీంతో అక్కడకు వచ్చిన పార్టీ నేతలు ఆమెను అక్కడి నుంచి తరలించారు.