: చాలా థ్యాంక్స్... మెగాస్టార్‌ కు 'మా' కిరీటి కృతఙ్ఞతలు


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా తన గెలుపుకు సహకరించిన మెగా ఫ్యామిలీకి నటకిరీటి రాజేంద్రప్రసాద్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని రాజేంద్రప్రసాద్, ఆయన ప్యానల్ లో గెలిచిన కాదంబరి కిరణ్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి శాలువాలు కప్పి చిరంజీవి అభినందించారు. రాజేంద్రప్రసాద్ గెలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కొత్త కార్యవర్గం సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. మా ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు నాగబాబు, రాజేంద్రుడి ప్యానల్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News