: చాక్లెట్లు కొనేందుకు కూడా టైం లేదు: బాబు
చైనాలో అన్ని రోజులు ఉన్నప్పటికీ తనకు, తనతో వచ్చిన వారికి క్షణం కూడా తీరిక లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విమానాలు ఎక్కుతూ, దిగుతూ, కనెక్టింగ్ విమానాలు పట్టుకోవడానికే సరిపోయిందని, కనీసం కంటి నిండా నిద్ర కూడా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం శ్రమించామని ఆయన అన్నారు. ఇంటికి తీసుకువెళ్లేందుకు చాక్లెట్లు కూడా కొనుక్కునే సమయం తమకు లేదని తెలిపారు. తన పర్యటన ఆసాంతం పూర్తి పారదర్శకమని, ఎటువంటి దాపరికాలు లేవని, ఎవరికీ భయపడనని, ప్రజలే హై కమాండ్ అని తెలిపారు. రాష్ట్రం బాగుపడి, సంపదను సృష్టించాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.