: తేజపై ఏపీ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిషేధం... డోంట్ కేర్ అన్న దర్శకుడు


పూర్తిగా తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులతో 'హోరా హోరీ' పేరిట చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పిన దర్శకుడు తేజపై నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీఎఫ్ఈఎఫ్) ప్రకటించింది. తేజకు సహకరించరాదని ఏపీఎఫ్ఈఎఫ్ లోని అన్ని అనుబంధ విభాగాలకూ సమాచారం ఇచ్చినట్టు ఫెడరేషన్ తెలిపింది. నిషేధం విషయమై దర్శకుడు తేజ స్పందిస్తూ, "నేనిప్పుడు వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాను. నాకు సహకరించకూడదని ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీలోని మిత్రుల ద్వారా తెలిసింది. కొత్త టాలెంట్ ను, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారికి అవకాశాలు ఇవ్వడానికే కట్టుబడి ఉన్నా. కొత్త రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ సినీ వర్కర్స్ బాడీ వచ్చిన తరువాత నన్ను నిషేధించే అధికారం ఏపీ ఫెడరేషన్ కు లేదు. నిషేధం ప్రభావం నాపై ఉండదు. నా సినిమా ముందు అనుకున్నట్టుగానే మేలో విడుదల అవుతుంది" అన్నారు.

  • Loading...

More Telugu News