: ఈ నెల 21న రాందేవ్ బాబాకు హర్యానా ప్రభుత్వ సన్మానం
యోగా గురువు రాందేవ్ బాబాను ఈ నెల 21న హర్యానా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ఆ రాష్ట్ర యోగా, ఆయుర్వేద ప్రచారకర్తగా ఉండేందుకు ఒప్పుకుని, ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేయనున్న సందర్భంగా సోనిపేట్ లో ఈ సన్మానం చేస్తున్నట్టు హర్యానా మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ సమయంలో రాందేవ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మినిస్టర్ హోదా కల్పించనునుంది. అంతేగాక యోగాపై ప్రజలను చైతన్య పరిచేందుకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు.