: ఇంతకూ ఏది తెలుగు జట్టు?


విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఈసారి ఏ జట్టుకు కలిసి వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నేటి పోటీలో ఏది తెలుగు జట్టు? అంటే చెప్పడం కష్టమే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెన్నైకి చెందినదైతే అందులో కేవలం ఒకే ఒక్క తెలుగు కుర్రాడు స్థానం దక్కించుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పేరుకి ఢిల్లీది అయినా జట్టు యాజమాన్యం (జీఎంఆర్) తెలుగు వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఏది తెలుగు జట్టు? అనేది నిర్థారించడం కాస్త కష్టమే అయినప్పటికీ, స్థానిక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాదు నీరాజనాలు అందుకుంటోంది. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ విఫలమైతే సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కోలుకోలేకపోతోంది. గత సీజన్ లో విశాఖ నుంచే పాయింట్ల పట్టికలో స్థానం సంపాదించుకున్న హైదరాబాదు జట్టు ఈ సారైనా సరైన ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందా? అనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. డుమిని, యురాజ్ సింగ్ వంటి ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మయాంఖ్ అగర్వాల్, యువీ జట్టును ఒడ్డున పడేసిన సంగతి తెలిసిందే. యువీకి ఈ స్టేడియంలో ఆడిన అనుభవం ఉంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించినా తెలుగు అభిమానులే విజయం సాధించినట్టు.

  • Loading...

More Telugu News